విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యాసంస్థలను జూన్ 12న పునః ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ దోమకొండ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల, వసతి గృహం, భోజనశాల, నివాసం, స్టోర్ రూం, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యాలయ ఆవరణలో మొక్క నాటారు.