నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చోరీలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు కామారెడ్డి అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు. చోరీలకు పాల్పడుతున్న నాందేడ్‌కు చెందిన నాందేవ్, రాందాస్, కర్ణాటకకు చెందిన క్రిష్ణ బాబు షిండే అలియాస్ క్రిష్ణకుమార్ షిండే, నాందేడ్‌కు చెందిన రాథోడ్ అజిత్ రమేశ్, నాందేడ్‌కు చెందిన రిసీవర్ గజానంద్ రామారావును అరెస్టు చేసినట్లు తెలిపారు.