సర్కారు బడి కూడ తక్కువేమి కాదని నిరూపించింది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన మన్నె కీర్తన. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపెట్ గ్రామానికి చెందిన మన్నె రాములు కుమార్తె కీర్తన ఐఐఐటిలో సీటు సాధించి మేము కూడా ప్రైవేట్ స్కూళ్లకు తక్కువేమీ కాదని నిరూపించింది. తండ్రి మాములు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామస్తులు ఆమెను అభినందించారు.