రాబోయే రెండు గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం కామారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.