కామారెడ్డి మండలానికి చెందిన తడకపల్లి శ్రీకాంత్ (32)మధ్యానికి బానిసై బుధవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి బీడీ వర్కర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఇతనికి 15ఏళ్ళ క్రితం లతతో వివాహం జరిగిందని, భార్యభర్తల గొడవతో భార్య పుట్టింటికి వెళ్లిందని తెలిపారు. భార్య కాపురానికి రావటం లేదని మనస్థాపముతో మద్యానికి బానిసై చెట్టుకు ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.