కామారెడ్డి జిల్లా లింగపూర్ కి చెందిన గాండ్ల సింగ్ మూడు రోజుల నుంచి కనిపించటం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్లో బంధువుల ఇంటికి వెళ్లి తప్పిపోయినట్లు చెప్పారు. బంధువుల ఇళ్లలో, చుట్టుపక్కల గ్రామాల్లో వెతికిన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.