కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో బుధవారం 12వ వార్డులో బీజేపీ నాయకులు కానకుంట గోవర్ధన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జడ్పీహెచ్ఎస్ పాఠశాల చుట్టూ ఉన్న ముళ్లపోదలను జెసిబి, ట్రాక్టర్ సహాయంతో తొలగించి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.