కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో యువకుడు సుర్ణబాబు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం ఉదయం ఆయన తన కొట్టంలో ఉరేసుకున్నాడు. ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.