ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం జన్మదినం సందర్భంగా కామారెడ్డిలోని టీజేఎస్ నాయకులు గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో రక్తదానం చేయడం జరిగిందన్నారు.