నిజామాబాద్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. పొతంగల్ మండలం చేతన నగర్ శివారులోని ఓ పౌల్ట్రీలో రెండు రోజుల్లో సుమారు 5 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. కోళ్ల మృతితో రూ.7 లక్షల వరకు నష్టపోయానని నిర్వాహకుడు రవి ఆవేదన వ్యక్తం చేశాడు. బర్డ్ ఫ్లూ కారణమన్న సందేహంతో అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి నమూనాలు సేకరించారు. అటు ఏపీలోనూ అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మరణిస్తున్నాయి.