యువకుడి అదృశ్యం

63చూసినవారు
యువకుడి అదృశ్యం
నిజామాబాద్ ఇస్లాంపుర కాలనీకి చెందిన చంద్రకాంత్ వాంజరి (27) అనే యువకుడు అదృశ్యం అయ్యాడని నిజామాబాద్ వన్ టౌన్ SHO డి. విజయ్ బాబు తెలిపారు. గత కొన్ని రోజులుగా అతడు మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడని, ఈ క్రమంలో తేదీ 15-05-2024 నాడు హైదరాబాద్ వెళుతున్నాను అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదన్నారు. అతడి ఆచూకీ తెలిస్తే 8712659837 నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్