
సమంత డేటింగ్ రూమర్స్.. స్పందించిన మేనేజర్
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో స్టార్ హీరోయిన్ సమంత డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై సమంత మేనేజర్ తాజాగా స్పందించారు. సమంత డేటింగ్ వార్తలన్నీ రూమర్స్ మాత్రమేనని ఆయన ఖండించారు. కాగా, ఇటీవల రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితంగా ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరలయింది. దాంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు కలిసి జీవించేందుకు ఓ ఇల్లు కూడా వెతుకుతున్నారని సమాచారం.