నిజామాబాద్ లో ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

58చూసినవారు
నిజామాబాద్ లో ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో బుధవారం పేకాటా ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి పేకాటాడుతున్న వారి వద్ద 5 సెల్ఫోన్లు, 11, 520 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. అనంతరం వారిని రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారివెంట సీఐ పురుషోత్తం, సిబ్బంది ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్