ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన విటల్ సిరికొండ నుండి ఇందల్వాయికి గురువారం రాత్రి వస్తున్న సమయంలో ఎదురుగా అడవి పందులు అడ్డు రావడంతో కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులో విటల్ ఒక్కడే ప్రయాణిస్తుండటంతో అతనికి ఎలాంటి ప్రమాదం కాలేదని, కారు స్వల్పంగా డ్యామేజ్ అయినట్లు తెలిపారు. తృటిలో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.