నవీపేట్ మండలం అనంతగిరికి చెందిన జీవన్ రెడ్డి (57) ఆర్థిక ఇబ్బందులు తాళలేక యంచా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని నవీపేట్ పోలీసులు తెలిపారు. ఈనెల 13న ఆటోలో యంచా గోదావరి దగ్గరికి వెళ్లి గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డరన్నారు. మంగళవారం మృతుడు కుమారుడు సంపత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.