నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. ప్రమాదవశత్తు జారి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి శివారులో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న రైల్లోంచి పడి వ్యక్తి మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.