నిజామాబాద్: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

62చూసినవారు
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో శనివారం తహశీల్దార్ ఆర్ రవీందర్ రావు మధ్యాహ్న భోజనం తనిఖీ చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందించాలి, నాణ్యమైన కూరగాయలను అందించాలి, వంట సామాగ్రి బియ్యం పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అలాగే స్టాక్ రూమ్ రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్