నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజ మహోత్సవాల సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. సిరికొండ మండల కేంద్రంలో శ్రీ శేష సాయి లక్ష్మీనారాయణ ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని భక్తులు తండోపతండాలుగా ఆలయాన్ని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు అని భక్తులు తెలిపారు.