కల్హేర్ మండలం మునిగేపల్లికి సాయిలు ఏ పని చేయకుండా మద్యం తాగుతూ ఉండటంతో భార్య ప్రమీల(29) మందలించింది. దానితో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చనిపోవడంతో మనస్తాపానికి గురైన ప్రమీల బుధవారం కొడుకును తీసుకుని బ్యాంకుకు వెళ్లి వస్తా అని ఇంట్లో చెప్పి వెళ్లి కొడుకుతో సహా నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో దూకింది. గురువారం ప్రాజెక్ట్ లో మృతదేహాలు తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటికి తీపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.