సిరికొండ మండలంలోని సోన్పలి, ధాబా(బి) గ్రామ భక్తులు ఆదివారం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విట్టల పాండురంగ నామస్మరణ భజనలతో ఇచ్చోడ విట్టల రుక్మిణి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విఠలేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నారు.