నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభత్సం

69చూసినవారు
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభత్సం
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకు ఒరిగాయి. కరెంట్ స్తంబాలు కింద పడడంతో విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒకేసారి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో జిల్లాలో రాత్రివేళ ఇబ్బందులు ఎదురయ్యాయి. నగరంతో పాటు పలు మండలాల పరిధిలో వందలాది చెట్లు విరిగిపడ్డాయి. భారీ గాలులు వీచడంతో రోడ్ల వెంట ఉన్న భారీ వృక్షాలు నేల కొరగడం వల్ల పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్