ప్రమాదం జరిగిన వెంటనే కుయ్ కుయ్ మని వచ్చే 108 అంబులెన్స్ అందరికీ తెలిసిందే. అందులో క్షతగాత్రులను సమయానికి గమ్యం చేర్చే పైలట్ పాత్ర అత్యంత ముఖ్యమైనది. కరోనా సమయంలో 108 ఉద్యోగుల పాత్ర ఎనలేనిది. ఎమర్జెన్సీ సమయాల్లో ఏ ఎమర్జెన్సీ కి ఎలా వెళ్ళాలి, అందులో వుండే సిబ్బందికి తగు సహాయం ఎలా అందించాలి అని సంస్థ వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. అందుకే వారిని ఆరోగ్య సంజీవని రథసారధులు అంటారు. ప్రతి సంవత్సరం మే 26 వ రోజున జాతీయ పైలట్ దినోత్సవంగా జరుపుకుంటారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న 18 వాహనాల్లో సిబ్బంది శుక్రవారం పైలట్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.