ఆర్మూర్ లో ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో సోమవారం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ సమైక్యతా స్ఫూర్తిని ప్రోత్సహించడం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మ నాయక్, ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ వేణు ప్రసాద్ పాల్గొన్నారు.