నిజామాబాద్ జిల్లా కేంద్రం ధర్మపురి కాలనీకి చెందిన తుమ్మల లక్ష్మి అనే వివాహిత బుధవారం బాసరలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ గణేష్ ఘాట్ వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.