
శానిటరీ నేప్కిన్స్ ప్యాకెట్లపై రాహుల్ బొమ్మ
బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో మహిళలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం విమర్శలపాలైంది. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళలకు ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ను పంపిణీ చేయాలని పార్టీ నిర్ణయించింది. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2,500తోపాటు ఉచితంగా నేప్కిన్లు అందజేస్తామని ప్రకటించింది. అయితే ఆ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ బొమ్మను ముద్రించడంతో వివాదం తలెత్తింది.