
రైతులకు గుడ్న్యూస్.. ఎన్టీఆర్ జలసిరి పథకం ప్రారంభం!
AP ప్రభుత్వం NTR జలసిరి పథకాన్ని మళ్లీ అమలు చేయనుంది. చిన్న, సన్నకారు రైతుల కోసం ఉచితంగా బోర్లు తవ్వించి, కుసుమ్ పథకంతో అనుసంధానించి రాయితీపై సోలార్ పంపుసెట్లు ఇవ్వనుంది. గత TDP ప్రభుత్వంలో అమలైన ఈ పథకాన్ని YCP ప్రభుత్వం "YSR జలకళ"గా మార్చి, సరిగ్గా అమలు చేయలేదన్న విమర్శల నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని పునఃప్రారంభించనుంది. త్వరలో ఈ పథకంపై పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.