మనుషుల చితాభస్మంతో రూ. 400 కోట్లు ఆర్జించిన జపాన్ ప్రభుత్వం
ఒక మనిషి బ్రతికున్నప్పుడే విలువ అనుకుంటాం కానీ.. చనిపోయాక కూడా మనిషి బూడిదకు అంతకు మించి విలువ ఉంది. ఎలానో తెలుసా..? మనిషి బూడిదలో డెంటల్ ఫిల్లింగ్స్, బోన్ ఇంప్లాంట్స్కు వాడే పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలు ఉంటాయని జపాన్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో అక్కడ చనిపోయిన 15 లక్షల మంది చితాభస్మం నుంచి లోహాలను సేకరించి విక్రయించడం ద్వారా దాదాపు రూ. 400 కోట్లను ఆర్జించింది. ఈ డబ్బులతో అక్కడి స్మశాన వాటికలను అభివృద్ధి చేస్తోంది.