తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ మాజీ సీఎస్ఓ, నిజామాబాద్ జిల్లా వాసి, సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం మృతిపట్ల మాజి మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ఉన్నతంగా సేవలందిస్తున్న గంగారాం లిప్టు ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.