
నాన్నా.. మీరే నా గురువు: మంత్రి లోకేశ్
ఏపీ మంత్రి నారా లోకేశ్ తన తండ్రి, సీఎం చంద్రబాబు నాయుడుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. 'నా గురువు, నా స్ఫూర్తిదాయకం, నా మార్గదర్శకం, నా గైడింగ్ లైట్ మీరే' అని ట్వీట్ చేశారు. తన తండ్రితో ఉన్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.