
మేం ఓడి గెలిచాం.. వాళ్లు గెలిచి ఓడిపోయారు: రోజా
AP: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా కూటమి అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా స్పందించారు. ‘తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మా అభ్యర్థి ఓటమి ‘ప్రజాస్వామ్య ఓటమి’. విధుల నిర్వహణలో మేయర్ శిరీషను అవమానించారు. అధికార దుర్వినియోగం గెలిచింది. మేం ఓడి గెలిచాం.. వాళ్లు గెలిచి ఓడిపోయారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు సమాధానం చెబుతారు.’ అని రోజా అన్నారు.