నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కార్యాలయం ఎదుట బుధవారం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మిక, ఉద్యోగులకు కనీస వేతనం 26, 000 అమలు చేయాలని, మృతి చెందిన కార్మిక ఉద్యోగి కుటుంబానికి 50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.