మహా సభల కరపత్రాల ఆవిష్కరణ

1379చూసినవారు
మహా సభల కరపత్రాల ఆవిష్కరణ
పౌర హక్కుల సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 16వ మహాసభలు ఈ నెల 22న నిర్వహించనుండగా గురువారం మహా సభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అల్గోట్ రవీందర్ మాట్లాడుతూ మనిషి జీవించే హక్కు, బావ ప్రకటన స్వేచ్ఛ కొరకు పౌర హక్కుల సంఘం 1973లో ఏర్పడిందన్నారు. సభలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.వై.రత్నం హాజరుకానున్నారని తెలిపారు. రాజ్యాంగం, చట్టాల ద్వారా మనిషికి సంక్రమించిన హక్కులు ప్రభుత్వాలు గౌరవించడం లేదన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ఏజెంట్ గా పనిచేస్తూ ప్రజల జీవించే హక్కును, చట్టాలను ప్రభుత్వాలే ఉల్లంఘిస్తుంటే న్యాయస్థానాలు కళ్ళప్పగించి చూస్తున్నాయని అన్నారు. సభలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో భాస్కర స్వామి, జెలేందర్, ప్రేమ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్