జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరులో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్, ఏకరూప దుస్తులను ఆలూరు మండల విద్యాశాఖాదికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏం నరేందర్ పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.