నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు శుక్రవారం హైదరాబాద్ తరలి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కల్పించిన పదోన్నతులలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పీఈటీలు, పీడీలుగా, పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. వెళ్లిన వారిలో 88 మంది పీడీలు, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ లు ఉన్నారు.