నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పండుగ కంటే ముందే దీపావళి సందడి నెలకొంది. ఈనెల 31న దీపావళి పండుగ సందర్భంగా నగరంలోని కంఠేశ్వర్, గాంధీచౌక్, పులంగ్ రోడ్డు ఇతర ప్రాంతాలలో దీపావళి పండుగ సందర్భంగా మట్టి ప్రమిదలను వ్యాపారులు అమ్ముతున్నారు. ప్రమిదలు ఆకర్షణీయంగా ఉండడంతో ప్రతి ఒక్కరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రమిదలు డజను రూ. 50 నుంచి 70 వరకు విక్రయిస్తున్నారు.