పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఎంపీ అర్వింద్ ధర్మపురి శనివారం మధ్యాహ్నానికల్లా హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు డిఎస్ మృతదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ కు తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నం డిఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు డిఎస్ కుటుంబ సభ్యులు తెలియజేశారు.