నిజామాబాద్: గాండ్ల సంఘంకు అండగా ఉంటా

55చూసినవారు
నిజామాబాద్: గాండ్ల సంఘంకు అండగా ఉంటా
నిజామాబాద్ నగరంలోని గాండ్ల పట్టణ సంఘం అభివృద్ధికి తనవంతుగా ఎల్లప్పుడూ కృషి చేస్తానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. గురువారం నగరంలోని సిర్నాపల్లిగడిలో గాండ్ల పట్టణ సంఘం రెండో అంతస్తును నుడా చైర్మన్ కేశ వేణు, సంఘం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూరు గాండ్ల పట్టణ సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని, సభ్యులు ఐకమత్యంతో అంచెలంచెలుగా ఎదగడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్