

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు మృతి
కర్ణాటకలోని హోసకోట్ సమీపంలోని గొట్టిపుర గేట్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిత్తూరుకు చెందిన కేశవరెడ్డి (44), తులసి (21), ప్రణతి (4), చిన్నారి (1) మృతి చెందారు. 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రులు హోస్కోట్లోని సిలికాన్ సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.