నిజామాబాద్ జిల్లాలో కత్తిపోట్ల ఘటన తీవ్ర కలకలం రేపింది. దుబ్బ ప్రాంతానికి చెందిన విశ్వనాథ్ కు భాస్కర్ రూ. 5 వేలు బాకీ ఉన్నాడు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని భాస్కర్ పై విశ్వనాథ్ ఒత్తిడి చేశాడు. విశ్వనాథ్ పై కోపం పెంచుకున్న భాస్కర్ సోమవారం మధ్యాహ్నం కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.