నిజామాబాద్: భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి

74చూసినవారు
నిజామాబాద్: భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం జిల్లాలో సమర్ధవంతంగా అమలయ్యేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. శనివారం ఆయన నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయాన్ని, సౌత్, నార్త్ తహసీల్దార్ ఆఫీసులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకుని, సంబంధిత రికార్డులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్