
పేకాట శిబిరంపై పోలీసుల రైడ్.. భయపడి కృష్ణా నదిలో దూకి మృతి
AP: పేకాట ఆడుతున్న ఓ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కృష్ణానది పాయలోని నీటి గుంతలో దూకి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా(D) తోట్లవల్లూరు(M) రొయ్యూరులో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. రొయ్యూరు లంక భూముల్లో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు చేపట్టారు. మద్దూరుకి చెందిన వల్లభనేని గోపాలరావు(30) వారి నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకాడు. ఈదలేక మునిగి చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.