జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం బోటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్ -2ఏ పరీక్షకు మొత్తం 477 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 17,064 మంది విద్యార్థులకు గాను 16,587 విద్యార్థులు హాజరయ్యారన్నారు. కాగా బోధన్ లో ఇద్దరు విద్యార్థులు చీటీలు రాస్తుండగా చీఫ్ సూపరింటెండెంట్ పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారన్నారు.