నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసిన ఏబీవీపీ

55చూసినవారు
నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసిన ఏబీవీపీ
తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పుపై వచ్చిన నివేదికను తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత్ చారి మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ పేరు మారుస్తే ఊరుకోమని, అవసరమైతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు ఉపకులపతి యాదగిరి రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్