నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు స్కాలర్షిప్లు రాకపోవడంతో సర్టిఫికెట్లు ఫీజులు కడితేనే ఇస్తామని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు పైచదువులు చదవడానికి అవసరమైన సర్టిఫికెట్లను ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏబీవీపీ నాయకులు అన్నారు. ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కి బుధవారం ఏబీవీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు.