విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తున్న ప్రెసిడెన్సీ ఇంటర్నేషనల్ విద్యాసంస్థల (ఆరావళి క్యాంపస్) మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కార్యాలయాన్ని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం ముట్టడించారు. అక్కడే బైఠాయించారు. దీనితో చర్యలు తీసుకుంటామని డీఈవో అశోక్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.