నిజామాబాద్: రోడ్డు ప్రమాదంలో ఆయుర్వేద వైద్యుడి దుర్మరణం

56చూసినవారు
నిజామాబాద్: రోడ్డు ప్రమాదంలో ఆయుర్వేద వైద్యుడి దుర్మరణం
నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆయుర్వేద వైద్యుడు దుర్మరణం చెందాడు. నగరంలోని గోల్ హనుమాన్ సమీపంలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్వహించే నందిపేట్ మండలం తల్వేదకు చెందిన చిట్టెం హనుమాండ్లు (54) బైక్ పై తన దగ్గర పని చేసే శ్రీహరితో కలిసి వస్తుండగా పులాంగ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టిప్పర్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో హనుమాండ్లు మృతి చెందగా శ్రీహరి గాయాలతో బయటపడ్డాడు.

సంబంధిత పోస్ట్