కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ
ఇన్ ఛార్జ్ మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత ఆదే ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పాశ కంటి మహేష్, తుమ్మ నాగభూషణం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశవేణు, నరాల రత్నాకర్ పాల్గొన్నారు.