కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రైతు పక్షపాతిగానే ఉంటుందని, పసుపు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మంగళవారం అన్నారు. జిల్లా కాంగ్రెస్ భవన్లో మానాల మాట్లాడుతూ ఇటీవల జిల్లాలోని పసుపు రైతులు ధర తగ్గుదలపై ఆందోళన చెందుతున్నారని, వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.