నిజామాబాద్ నగరంలోని స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల చేతుల మీదుగా 13 మంది మహిళా వర్కర్లకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ యోహాన్, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, అందులో ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, కిరణ్మయి, బాలరాజు, మౌనిక అన్విత తదితరులు పాల్గొన్నారు.