నిజామాబాద్: పోలీసుల దెబ్బలకే మృతి చెందాడని కుటుంబీకుల ఆందోళన

63చూసినవారు
పోలీసుల దెబ్బలకే తమ వ్యక్తి మరణించాడని కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన ఆలకుంట సంపత్ (32) తమను గల్ఫ్ పంపుతామని మోసగించారని బాధితుల ఫిర్యాదు మేరకు ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి GGHలో చేర్పించగా మృతి చెందాడు. పోలీస్ దెబ్బలకు మృతి చెందాడని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్